- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ రైతుల శ్రమకు ప్రతిఫలమే పంటరాశులు..
దిశ, నందిపేట్ : రైతులకు చట్టసంబందిత విషయాలలో చైతన్యవంతులను చేయడానికి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు. నందిలేట్ మండల కేంద్రలోని రైతువేదిక కార్యాలయంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ను సీనియర్ సివిల్ జడ్జిలు పద్మావతి, నజీమ్ సుల్తానా, జూనియర్ సివిల్ జడ్జి దీప్తిలతో కలిసి ప్రారంభించి రైతులు, గ్రామఅభివృద్ధి కమిటీల సభ్యులనుద్దేశించి ప్రధానోపన్యాసం చేశారు. ప్రభుత్వ సహాయ, సహకారాలు ఒకవైపు, న్యాయవ్యవస్థతోడ్పాటు మరొక వైపు రైతు నాగలికి రెండు వైపులా నిలబడి చేదోడుగా నిలుస్తున్న వైనాన్ని వెల్లడించారు.
విత్తన కొనుగోలు, అమ్మకాలలో జరిగే మోసాన్ని తెలియజేస్తు చట్టం రైతులకు ఏ విధంగా సహాయకారిగా నిలుస్తుందనే విషయాన్ని తెలిపారు. వినియోగదారుల హక్కుల చట్టం ఒక బలమైన ఆయుధమని దానిని అవసరమైనపుడు వినియోగించుకోవాలని జిల్లాజడ్జి సూచించారు. ఆర్మూర్ డివిజన్ లోని కొన్ని గ్రామ అభివృద్ధి కమిటీల చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలపై ఫిర్యాదులు రాష్ట్ర హైకోర్టు కు చేరినందున కమిటీలు చట్టవ్యతిరేకమైన తీర్మానాలు, పౌరుల సాంఘిక బహిష్కరణలు నిరోధించాలనే లక్ష్యంతో వెళుతున్నామని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చాలా తీవ్రంగా ఆలోచిస్తు అడ్డుకట్ట వేయాలని చూస్తోందన్నారు.
గ్రామాలలో రాజ్యాంగబద్ధమైన పాలన వ్యవస్థల వ్యవహారాలే చలామణి కావాలనే ఉన్నత న్యాయస్థానం ఆలోచన విధానానికి అనుగుణంగా కమిటీల ఆలోచనవిధానం మారాలని ఆమె కోరారు. వసుధైక కుటుంబాలు మనవి అవి గ్రామంలో పరిడవిల్లాలనే మన భారతీయ సంస్కృతిలో పునరంకితం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఏవైనా చట్టపరమైన అంశాలలో న్యాయ సలహాకు, న్యాయ సహాయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ కోర్టు ప్రాంగణాలలోని న్యాయసేవ సంస్థ కార్యాలయాలను సంప్రదించాలని జిల్లాజడ్జి తెలిపారు.
న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నజీమ్ సుల్తానా మాట్లాడుతు నందిపేట్ చుట్టుపక్కల రైతుల వ్యయసాయ పద్ధతులు, వ్యయసాయ శాస్త్రవేత్తల పరిశోధనలకు ఉపయోగ పడాలని, ప్రతి వారికి ఉపయోగపడే విధంగా ఒకరికొకరు సహాయకారులు కావాలనే న్యాయసిద్ధాంతానికి దోహదకారులుగా ఉండాలనే సంకల్పంతో న్యాయసేవ సంస్థ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారిణి భవాని, మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగ వర్ధన్, నందిపేట్ సర్పంచ్ వాణి, నందిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, పండరి రాజు, కుమ్మరి సాగర్ రైతులు పాల్గొన్నారు.
తరలివచ్చిన రైతులు..
అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభిత్సవానికి నందిపెట్, చిమ్రాజ్ పల్లి, లక్కంపల్లి, తల్వేద, ఆంధ్ర నగర్, వెల్మల్, షాపూర్, కొత్తూర్, కంఠం, సి.హెచ్ కొండూరు గ్రామాల రైతులు, గ్రామ అభివృద్ధి కమిటీల అధ్యక్షులు, సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతు వేదిక మొత్తం నిండిపోయి కలకళలాడింది.