- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాడివేడిగా బీబీపేట సింగిల్ విండో మహాజనసభ
దిశ,దోమకొండ : బీబీపేట సింగిల్ విండో మహాజన సభ గందరగోళంగా కొనసాగింది. గురువారం విండో చైర్మన్ ఇంద్ర సేనా రెడ్డి అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు నిధుల దుర్వినియోగంపై గందరగోళం సృష్టించారు. సింగిల్ విండో పరిధిలో పనిచేసిన క్లర్కు రంగారెడ్డి 11.30 లక్షలు దుర్వినియోగం చేసినప్పటికీ పాలకవర్గం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ విషయమై పలువురు సుదీర్ఘ చర్చలు జరిపారు. దుర్వినియోగం జరిగిన విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని, వెంటనే సంబంధిత అధికారులకు తెలుపగా అతని నుండి డబ్బులు రికవరీ చేశారని చైర్మన్ ఇంద్రసేనారెడ్డి రైతులకు నచ్చ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భూమా గౌడ్ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంగా ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయించే విధంగా తీర్మానం చేయాలని మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూమా గౌడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు సభ నుండి బయటకు వెళ్లిపోవడంతో చైర్మన్ ఇంద్రసేనారెడ్డి వారికి నచ్చచెప్పి సమావేశానికి తీసుకువచ్చారు.
సింగిల్ విండో పరిధిలో ఉన్న స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు అనే నాయకుడు ప్రశ్నించగా, టీఆర్ఎస్ నాయకులు మళ్లీ కాంగ్రెస్ నాయకులతో వాగ్వేదానికి దిగారు. అనంతరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం కోసం ముందుంటామని హామీ ఇచ్చారు.రైతులు వరి ధాన్యాన్ని ఆరపెట్టుకునేందుకు ప్రతి ఒక్క ఎంపీటీసీ సభ్యుడు కళ్ళం కొరకు నిధులను వెచ్చించాలని చైర్మన్ ఇంద్రసేనారెడ్డిని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, గాడి లింగం, సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, నాగరాజు గౌడ్, బాపురెడ్డి, ఆది రాజయ్య, భూమా గౌడ్, సుతారి రమేష్, సాయినాథ్, కార్యదర్శి నర్సా గౌడ్, డైరెక్టర్లు మల్లేశం, నరేందర్, శ్రీనివాస్, రాజయ్య, సత్యనారాయణ, కిరణ్ రెడ్డి, రామకృష్ణ, లక్ష్మీ, విజయ, క్లర్కు బాలరాజ్, సిబ్బంది రవి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.