కాంగ్రెస్ డిక్లరేషన్లు ఉత్తమాటలేనా...!

by Kalyani |
కాంగ్రెస్ డిక్లరేషన్లు ఉత్తమాటలేనా...!
X

దిశ, నిజామాబాద్ సిటీ : భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లి /తండ్రి /భార్యకు రూ. 25,000 గౌరవ పెన్షన్ ఇస్తానని ఇప్పటివరకు దాని ఊసే లేదని అన్నారు. ప్రతి ఏడాది జూన్ 2నాటికీ అన్ని శాఖల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు చేపడతమని హామీ ఇచ్చి ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని సెప్టెంబర్ లోపు నియామకాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు.

మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మెగా అని చెప్పి 7 నెలలు గడుస్తున్న నియామకాలు పూర్తి స్థాయిలో జరగడగం లేదని, మెగా డీ ఎస్ సీ విడుదల చేయాలి అని బి జె వై ఎం కార్యకర్తలు నిరసనలు చేస్తే పోలీసులతో నిర్భందించి, ముందస్తు అరెస్టులు చేసి, పలు చోట్ల లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే మెగా డి ఎస్ సీ ప్రకటించి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని జిల్లా పోలీస్ కమిషనర్ ను హెచ్చరించారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కుల గణన, బిసి కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలో వచ్చిన 6 నెలలోపే బీసీ రిజర్వేషన్లు పెంపొందిస్తామని అలాగే కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బిసి రిజర్వేషన్ 23% నుండి 42% కి పెంచుతాం అన్న హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ ఏమైంది అని ప్రశ్నించారు. జరిగిన మొదటి విడత కుంభకోణంలో గత ప్రభుత్వాన్ని కేసీఆర్ ని కాపాడే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అని ఆరోపించారు.

కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు అని రైతు సంక్షేమం కొరకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అని చెప్పి రైతులను మోసం చేసిందని రైతన్నల సాగుకు ఇస్తానన్న 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన మీడియా మిత్రులకు ఇళ్ల కేటాయింపు హామీ హామీగానే ఉందని గత ప్రభుత్వం బి ఆర్ ఎస్ ఇల్లు నిర్మించి ఇస్తానని 10 ఏళ్ళు మోసం చేసి, కాంగ్రెస్ రేవంత్ సర్కార్ కూడా అదే తోవలో పోతుందని అన్నారు. ఉచిత బస్సు అని అమ్మాలక్కలకు కొట్లాట పెట్టిండని ఆటో డ్రైవర్ అన్నలకు భరోసాగా ఏడాదికి 12,000 ఆర్థిక సాయం ఏమైందని రేవంత్ ని ప్రశ్నించారు. మేనిఫెస్టో లో పెట్టిన డిక్లరేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం జరిగిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ జిల్లా అధికారులతో సమావేశం జరిగిందని అర్బన్ నియోజకవర్గం లో అమ్మ వెంచర్, సోనీ ఫంక్షన్ హాల్ బ్రిడ్జి పనులు మధ్యంతరంగా నిలిచిపోయిన వాటిని పూర్తి చేయాలని, కంటేశ్వర్, గాజుల్ పేట్, దేవి టాకీస్ స్మశాన వాటికల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని అలాగే నగరంలో బొందెం చెరువు, రామర్తి చెరువు కబ్జా దారుల పైన చర్యలు తీసుకోవలని, శంబుని గుడి చుట్టూ ఉన్న అక్రమ షాపులను తొలగించాలని, పాత కలెక్టర్ కార్యాలయంలో 12 ఎకరాలలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాలని జిల్లాలో జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని వారికీ ఉపయోగకరంగా ఉంటుందని బోధన్ బస్టాండ్ కాంప్లెక్స్ వంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, కార్పొరేటర్స్ ఎరం సుధీర్, మాస్టర్ శంకర్, అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్, బీజేపీ ఆఫీస్ సెక్రటరీ బద్దం కిషన్, మండల అధ్యక్షుడు గడ్డం రాజు,పుట్ట వీరేందర్, బీజేపీ నాయకులు, ప్రభాకర్,ఆనంద్, పవన్, కార్తీక్, ఖైజార్, అంబదాస్,హరీష్, భూమేష్, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed