- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఎద్దు పని చేయకుంటే అమ్మేసినట్లు పని చేయని ఎమ్మెల్యేను మర్చేద్దాం'
దిశ, నిజామాబాద్ రూరల్ : ఎద్దు పని చేయకుంటే అమ్మేసినట్లు పనిచేయని ఎమ్మెల్యేను మర్చేద్దామని, అభివృద్ధి చేయని ఎమ్మెల్యేను ఓడించాలని రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి అన్నారు. సోమవారం డిచ్పల్లి మండల్ కోరట్ పల్లి తండా, కొరట్ పల్లి గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామఉపసర్పంచ్ వడ్డే భూమన్న, వారి గ్రామ సభ్యులతో దాదాపు 45 మందికి పైగా నిజామాబాద్ రూరల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ పది సంవత్సారాలు పని చేసిన కూడా ఎమ్మేల్యే రూరల్ ను అభివృద్ధి చేయలేక పోయారని, కొరట్ పల్లిలో ఇద్దరికి దళిత బంధు ఇచ్చి వారి నుంచి కమిషన్లు తీసుకున్నారని అన్నారు.
కోరట్ పల్లిలో అర్హులైన వారు లేరా అని ప్రశ్నించారు. మీ తొత్తులకు మాత్రమే దళిత బంధు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మీ ఊరికి పక్కన ఉన్న ఇసుక, మోరం అమ్ముకున్నారని హెద్దేవా చేశారు. నేను ఉద్యమ సమయంలో మీతో ఊరూరా తిరిగానని, బాజిరెడ్డి ఎప్పుడన్నా జై తెలగాణ అన్నాడ, తె లంగాణ కోసం ఉద్యమం చేశాడా అతనికి ప్రజల భాధలు ఎలా తెలుస్తాయి అన్నారు. ఎమ్మేల్యే అయ్యాక వందల కోట్లు సంపాదించుకున్నారని, వందలాది ఎకరాలు కబ్జా చేశారని అన్నారు. నేను ఎమ్మెల్సీగా ఇక్కడ రోడ్లు, బోర్లు వేయించానని అన్నారు. ఒక్కసారి నాకు ఎమ్మేల్యే గా అవకాశం ఇస్తే రూరల్ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.