ఖాకీలలో కలవరం

by Sridhar Babu |
ఖాకీలలో కలవరం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన 2014 బ్యాచ్ కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రమేష్ కూడబెట్టిన రూ.23 కోట్ల ఆస్తులను మాదక ద్రవ్యాల నిరోదక చట్టం (ఎన్డీపీఎస్) కింద తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అధికారులు జప్తు చేశారు. ఈ మేరకు ఈనెల 20న ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న రమేష్ రంగారెడ్డి జిల్లా శాబాద్ కు చెందిన గుండమల్ల వెంకటయ్యలు రెండు కిలోల అల్పోజోలం అమ్ముతుండగా గతేడాది డిసెంబర్ 25న టీఎస్ న్యాబ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిద్దరు కృత్రిమ కల్లు తయారీలో వినియోగించే నిషేధిత అల్పోజోలం దందాలో రూ.23 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. దాంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్, సివిల్ పోలీసు శాఖలో కలకలం రేపింది.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక్క ఆర్మూర్ డివిజన్ లో కొన్ని ప్రాంతాలు మినహా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మొత్తం కల్తీకల్లు తయారవుతుంది. దానికి నిషేధిత డైజోపాం, క్లోరోహైడ్రెట్ లేదా అల్పోజోలం వినియోగిస్తారు. సంబంధిత మత్తు పదార్థాలను గతంలో హైదరాబాద్ లోని ఇండస్ట్రీయల్ ఏరియా నుంచి బల్క్ డ్రగ్ పరిశ్రమల నుంచి రవాణా చేసేవారు. ప్రభుత్వం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపడంతో బొంబాయి, మహారాష్ట్ర నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలించేవారు. తాజాగా ఈ నెలలో రాజస్థాన్ నుంచి రెండు లక్షలకు కిలో చొప్పున అల్పోజోలం తెచ్చి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విక్రయిస్తున్న మూఠాను నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుట్టురట్టు చేశారు.

కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ రమేష్ గతేడాది టీఎస్ న్యాబ్ అధికారులకు రెడ్ హ్యండేడ్ గా చిక్కడంతో కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న మరికొంత మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు కలవరపడ్డారు. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తూ పనిష్మెంట్ కింద సిరిసిల్లా జిల్లాలో పని చేస్తున్న ఒకరు, మహారాష్ర్ట సరిహద్ధులోని చెక్ పోస్టులో పని చేస్తున్న మహ ముదురు మరొకరు, కామారెడ్డిలో పని చేస్తున్న మరొకరు తమ పేరు ఎక్కడ రమేష్ ఉచ్చరిస్తాడోనని హడలి పోయారు. ఆనాడు టీఎస్ న్యాబ్ కు చిక్కిన వారి కుటుంబ సభ్యుల కాళ్లావెళ్లా పడి తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం. రమేష్ ను కోర్టు కేసుల నుంచి తీసుకువచ్చే బాధ్యతలను ఎత్తుకున్నారట అక్కడి ఎక్సైజ్ శాఖలో అల్పోజోలం దందాలో నిమగ్నమైన మరో ముగ్గురు. 2014 బ్యాచ్ కు చెందిన రమేష్ ఒక్కడే 20 కోట్లు పోగేస్తే ముదుర్లు మరేంత పోగు చేశారనే చర్చ జరుగుతుంది. ముగ్గురు గురించి ఎక్సైజ్ శాఖలో ఎవ్వరిని అడిగినా చెబుతారని,

వారికి అందరితో సత్సంబంధాలు ఉన్నాయని అక్కడ బహిరంగంగా చెబుతున్నారు. అక్కడ కల్లీ కల్లు తయారీదారులు స్మగ్లర్ల పేర్లు ఉచ్చరించకుండా ఎక్సైజ్ కానిస్టేబుళ్లు , హెడ్ కానిస్టేబుళ్ల పేర్లను తరుచూ అందరి నోట నానుతుందని సమాచారం. కృత్రిమ కల్లు తయారీ డిపోలకు నిత్యం లక్షల విలువైన అల్పోజోలం సరఫరా అవుతుండగా వాటి అసుపాసులు తెలిసిన అబ్కారి సిబ్బంది అ దందాలో మునిగి తేలుతున్నారు. అధికారులకు ఎవ్వరి స్థాయిలో వారికి మాముళ్లు లక్షల్లో ముడుతుండటంతో కల్లు డిపోలలో తయారీ కల్లు గురించి, ప్రధానంగా నిషేధిత మత్తు పదార్థాల రవాణా దందాపై చర్యలు ఉండవని చెబుతున్నారు. కేవలం రికార్డుల పరంగానే దాడులు అని చెప్పకనే చెబుతున్నారు. లేకపోతో ఉమ్మడి జిల్లాలో నిత్యం కోట్ల విలువైన లక్షల లీటర్ల కృత్రిమ కల్లు తయారీ అవుతుందంటే ప్రధానంగా

ఎక్సైజ్, సివిల్ పోలీస్ శాఖ చలవే. మత్తు పదార్థాల రవాణా దందా అనగానే నిజామాబాద్ జిల్లాలో అబ్కారి శాఖ పేరు ప్రముఖంగానే వినిపిస్తుంది. జిల్లా కేంద్రంలోని టాస్క్ పోర్స్ లో పని చేసే ఇద్ధరు కానిస్టేబుళ్ల వైపు అందరి వేళ్లు చూపెడుతున్నాయి. గత కొంత కాలంగా జిల్లాలో పని చేస్తున్న ఇద్ధరికి మత్తు పదార్థాల రవాణా దందాలో ప్రమేయం ఉందని సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బందికి ఎరుక. ఇదిలా ఉండగా ఇటీవల నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చేత వేటుకు గురైన ఇద్ధరు కానిస్టేబుళ్లకు మత్తు పదార్థాల దందాలో ప్రమేయం ఉందని అంతా కోడై కూసింది. ఎల్లారెడ్డి పరిధిలో కల్లు మూస్తేదారులకు నిజామాబాద్ సబ్ డివిజన్ లో పనిచేస్తున్న

ఇద్ధరు సివిల్ కానిస్టేబుళ్లు మత్తు పదార్థాల రవాణాలో కీలకంగా ఉన్నారని పోతీస్ శాఖ పేర్కొంటుంది. వారు ఈ దందాలో కుడబెట్టిన వాటితోనే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి ఇటీవల ఒక రియాల్టర్ ఇచ్చిన గోవా టూర్ కు విత్ అవుట్ పర్మిషన్ లో జిల్లా సరిహద్ధు దాటి సస్పెన్షన్ కు గురయ్యారు అనే ప్రచారం జరుగుతుంది. పోలీస్, ఎక్సైజ్ అనే డిపార్ట్ మెంట్ ఐడితోనే నిషేధిత మత్తు పదార్థాల దందాను నడుపుతున్నారని చెప్పాలి. వారి కదలికలపై నిఘావేసి రెడ్ హ్యండెడ్ గా పట్టుకోకపోతే ఇతర శాఖాల అధికారులకు చిక్కినప్పుడు మాత్రం శాఖ పరువుతో పాటు జిల్లా పరువు పోవడం ఖాయమని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed