ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ చైనాదే

by Y. Venkata Narasimha Reddy |
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ చైనాదే
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ అతిపెద్ద అపార్ట్ మెంట్ రికార్డు చైనా దేశానికే దక్కింది. చైనాలోని కియాన్‌జియాంగ్ సెంచురీ నగరంలో 675 అడుగుల ఎత్తైన బహుళ అంతస్తుల భవనం చైనాలోనే అద్భుమైన కట్టడంగా..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలుస్తోంది నిలుస్తుంది. 39 అంతస్తులతో 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ‘ఎస్‌’ ఆకారంలో నిర్మించారు. ఈ భవనంలో గరిష్ఠంగా 30 వేల మంది నివసించేందుకు వీలుగా నిర్మించారు. రీజెండ్ ఇంటర్నేషనల్ పేరుతో ఈ భవనం 2013 లోనే ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భారీ భవనంలో నివాసితులు బిల్డింగ్‌ కాంపౌండ్‌ కూడా దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సకల వసతులు ఏర్పాటు చేశారు. ఇందులో షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, స్కూళ్లు, హాస్పిటల్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, నిత్యవసర దుకాణాలు, సెలూన్లు, అహ్లాదకరమైన పార్కులు.. ఇలా సకల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఆకాశహర్మ్యంలో 20 వేల మంది నివాసం ఉంటున్నారు. మరో 10 వేల మందికి సరిపడా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో విస్తీర్ణాన్ని బట్టి రూ.18 వేల నుంచి రూ.50 వేల వరకూ అద్దె ఉంటుందట. వేలాది మంది ఒకేచోట నివసించే విధంగా చేపట్టిన ఈ అత్యాధునిక భవన నిర్మాణం అద్భుతమని, అర్కిటెక్టుల ప్రతిభకు నిదర్శనమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏదైనా ప్రమాదాలు తలెత్తితే మాత్రం సహాయ చర్యలు అంత ఈజీ కాదన్న సందేహాలు సైతం వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story