సర్కారు పథకాలు ఇప్పిస్తానని అలా చేశాడు..

by Sumithra |   ( Updated:2022-10-04 14:00:32.0  )
సర్కారు పథకాలు ఇప్పిస్తానని అలా చేశాడు..
X

దిశ, ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇప్పిస్తానంటూ టీఆర్ఎస్ ఎస్టీ విభాగం ఆర్మూర్ మండల అధ్యక్షుడు పసుల రాజు డబ్బులు వసూలు చేస్తున్నందున చర్యలు తీసుకోవాలని నాయక్ పోడ్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శంకర్ కు నాయకపోడ్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంగళవారం ఆదివాసి నాయక్ పోడ్ నాయకులు సింగిరెడ్డి మోహన్, పొలిటికల్ కన్వీనర్ రాటం అరుణ్, బొంత సురేష్ లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ మండలం ఖానాపూర్ కు చెందిన పసుల రాజు ప్రభుత్వ పథకాలను మంజూరు చేయిస్తానని పేర్కొంటూ డొంకేశ్వర్, నందిపేట్, అన్నారం, మాక్లూర్, అందాపూర్, మగ్గిడి తదితర గ్రామాలలో డబ్బులు వసూలు చేసినట్లు వివరించారు. ఎస్టీలతోపాటు ఇతర కులాల వారి వద్దకు వెళ్లి పింఛన్లు, గురుకులాల్లో సీట్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కళ్యాణ లక్ష్మి తదితర పథకాలు ఇప్పిస్తానని పేర్కొంటూ డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. రాజు మాయమాటలకు నమ్మి ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

మోసపోయిన బాదితులకు డబ్బులు ఇప్పించే విధంగా కృషి చేస్తామన్నారు. రాజు పై నాయక్ పోడ్ జిల్లా సంఘం చర్య తీసుకొని బాధితులకు అండగా ఉండాలని కోరారు. ఎస్టీ సర్పంచ్ గా ఉన్న సింగిరెడ్డి మోహన్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పారు. ఈ సమావేశంలో ఆదివాసి నాయక్ కోడ్ జిల్లా జాయింట్ కార్యదర్శి గడ్డం సాగర్, జిల్లా కోశాధికారి సురేష్ రాజేందర్, జిల్లా సలహాదారులు గోపి సాయన్న, సభ్యులు తౌడు మహేష్, మెట్టు పోశెట్టి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed