పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే పోటీ

by Disha Web Desk 15 |
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే పోటీ
X

దిశ, లింగంపేట్ : పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెల్లడించారు. గురువారం మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు అనుకుంటేనే నాయకులు తయారవుతారని అన్నారు. కార్యకర్తలే నాయకులను తయారు చేస్తారని, వారు కష్టపడితేనే నాయకులు అవుతారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉంటుందని అన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలు వివరించాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ గడ్డపై కాషాయపు జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కొక్క బూత్​ పరిధిలో 300 ఓట్లు వచ్చే విధంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. కష్టపడ్డ వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని విధాలుగా ఆదుకుంటామని, అండగా ఉంటాం అన్నారు. కార్యకర్తలు భయబ్రాంతులకు గురికావద్దన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారాన్ని వేగవంతంగా చేయాలన్నారు.

జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు లింగంపేట్ మండలంలో లీడ్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ బాణాల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు తానాజీ రావు, బాపురెడ్డి పైలా కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు లింగారావు, మురళి, బొల్లారం సాయిలు, దత్తు, రాములు, బూత్ స్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed