ఆసుపత్రిని తనిఖీ చేసిన వైద్య విధాన పరిషత్ కమిషనర్

by Sridhar Babu |
ఆసుపత్రిని తనిఖీ చేసిన వైద్య విధాన పరిషత్ కమిషనర్
X

దిశ, కామారెడ్డి : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచిన విషయమై వార్తలు రావడంతో స్పందించిన ఆయన ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఐసీయూ, ట్రామా కేర్ తదితర వార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి ఎలుకల విషయమై తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తామని, ఎలుకలను తరిమి వేయిస్తామని రోగులు, వారి బంధువులకు హామీ ఇచ్చారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి తో పాటు వైద్యులు ఉన్నారు.

రోగులను పరామర్శించిన బర్రెలక్క

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల దాడిలో గాయపడిన రోగులను బర్రెలక్క పరామర్శించారు. ఈ సందర్భంగా వారి బంధువులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైద్య సిబ్బందిని కోరారు. ఆస్పత్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed