పదో తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

by Kalyani |
పదో తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, వాగ్దేవి హై స్కూల్లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల రికార్డులను పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మొదటిరోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని 62 పరీక్ష కేంద్రాలలో 11,962 మంది విద్యార్థులకు గాను 11,940 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ప్రైవేట్ గా పరీక్ష రాయడానికి 24 మంది విద్యార్థులకు గాను ఐదుగురు హాజరయ్యారు. 19 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story