- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్రాంతి పండుగ రోజు శుభవార్త వినబోతున్న ఇందల్వాయి ప్రజలు!
దిశ, ఇందల్వాయి: మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి వెళ్లి గదులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ పెండింగ్ వర్క్స్ పనులు రోడ్లు, వైరింగ్, డ్రైనేజీలు, వంటి పనులను వెంటనే వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్స్ కు సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు జనవరి 15 లోపు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా చూడాలని అధికారులకు తెలిపారు. జనవరి 15 లోపు గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అన్నారు. జనవరి 15 సంక్రాంతి పండుగ రోజు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కు గ్రామస్తుల విన్నపం
గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన నిరుపేద కుటుంబాలు ఎక్కువ ఉన్నందున కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను గ్రామ సర్పంచ్ పాశంసలు, ఉప సర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీ సుధాకర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ అధికారులు తమ భూములను మొత్తం బౌండరీ తీస్తున్నారని తెలిపారు. స్పందించిన కలెక్టర్ తాను ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రోజా, ఆర్ఐ, గ్రామ సర్పంచ్ పాశం సత్తెవ్వ నర్సింలు, ఉపసర్పంచ్ లింగంపల్లి రాజేందర్, ఎంపీటీసీ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి భరత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- nizamabad