- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోటల్ భోజనంలో బొద్దింక.. ఫైన్ వేసిన మున్సిపల్ కమిషనర్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ః ఈ నడుమ హోటల్ లో ఏది తినాలన్నా భయం వేస్తోంది. ఎందుకంటే హోటల్ తిండిలో ఏదో ఒక రకమైన పురుగులు కనిపిస్తుండటం సంచలనంగా మారింది. ఇక తాజాగా నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంకు పక్కనే ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న సాయిమోక్ష హోటల్ లో ఆహారంలో బొద్దింక ప్రత్యక్షం అయింది. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేస్తున్న ఒక వ్యక్తి తింటున్న ఆహారంలో బొద్దింక కనిపించింది. దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని నిలదీయగా జవాబుదారీగా స్పందించలేదు. దీంతో బాధితుడు నేరుగా మున్సిపల్ కమిషనర్ మకరందుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కమిషనర్ మున్సిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్ ను విచారణకు పురమాయించారు. తన సిబ్బందితో కలిసి శానిటరీ ఇన్ స్పెక్టర్ హోటల్ కు వెళ్లి పరిశీలించారు. సదరు వ్యక్తి తిన్న ఆహారంలో బొద్దింక ఉందని నిర్ధారించుకున్న అధికారి హోటల్ యాజమాన్యానికి నోటీసు జారీచేశారు. రూ.5,000 ల జరిమానా విధించారు. హోటల్ పరిసరాలు, ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాల నిల్వలపై మూతలు పెట్టి ఉంచాలని కమిషనర్ మకరందు ఆదేశించారు. మరోసారి ఇలాగే, కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హోటల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు.