- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రైతులను రాజులు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం'
దిశ, ఆర్మూర్: రైతులను రాజులను చేయాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని తెలంగాణ మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు స్వచ్ఛమైన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ అందిస్తున్న మద్దతు ధరను రైతులు పొందాలన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల అభ్యున్నతికి బృహత్తరమైన సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి, అంకాపూర్ సర్పంచ్ పూజిత రెడ్డి, ఉప సర్పంచ్ కిషోర్ రెడ్డి, ఎంపీటీసీలు ఎంసీ. గంగారెడ్డి, మంగళవారం మహేందర్, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ ముక్తార్, సీఈఓ శ్యామ్, ఆర్మూర్ డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ సందీప్, సొసైటీ డైరెక్టర్‌లు, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.