కరెంటు షాక్ తగిలి చిరుత మృతి.. గుట్టు చప్పుడు కాకుండా పూడ్చివేత

by Mahesh |
కరెంటు షాక్ తగిలి చిరుత మృతి.. గుట్టు చప్పుడు కాకుండా పూడ్చివేత
X

దిశ, ఎల్లారెడ్డి: అడవి జంతువులకు రక్షణ కరువైంది.జనారణ్యంలోకి రావడం ప్రాణాలు కోల్పోవడం జరుగుతూనే ఉంది. రైతులు పంట పొలాల వద్ద పంట రక్షణకై విద్యుత్ షాక్ పెట్టడం వాటికి అడవి జంతువులు పడడం మాములుగానే జరుగుతుంది.కానీ అటవీ శాఖ అధికారుల ప్రజలకు అవగాహన కల్పించడం లో కరువయ్యారు. ఎల్లారెడ్డి మండలం లో,హాజీపూర్ తండా గ్రామంలో,రైతు నుద్ద్య నాయక్, కట్టాకింది తండాకు చెందిన వ్యక్తి చెరుకు తోట‌కు విద్యుత్ షాక్ తగిలించాడు. దీంతో అటుగా వచ్చిన చిరుత విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. విద్యుత్ శాఖ‌కు చిరుత చనిపోవడం తో విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా అధికారులు కప్పి వేస్తున్నారు.

అటవీ శాఖ, అధికారులు స్థానికంగా ఉండక తమ ఇష్టం వచ్చిన, సమయానికి,కార్యాలయానికి వచ్చి,హాజరు పట్టికలో తమ దినసరి హాజీర్ వేసుకొని హాయిగా రోడ్లపై ప్రయాణిస్తున్నరని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం కూడా అడవిని ఆనుకొని ఉన్న గ్రామాలలో కి వచ్చి పరిసర ప్రాంతాలను, పరిశీలించుకోవడం చిరుత చావుకి కారణం అని ప్రాంత ప్రజలు అటవీ శాఖ అధికారులపై మండిపడుతున్నారు. ఎల్లారెడ్డి రేంజ్ అటవీ శాఖ అధికారుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు సంబంధిత శాఖ అధికారులను వేడుకుంటున్నారు. కాగా చిరుతు కరెంట్ షాక్ తగిలి చనిపోయిందని విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని తగు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed