మామిడిపల్లిలో చైన్ స్నాచింగ్..

by Hamsa |
మామిడిపల్లిలో చైన్ స్నాచింగ్..
X

దిశ ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల వెంకటేశ్వర కాలనీలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో చైన్ స్నాచింగ్ సంఘటన చోటు చేసుకుంది. వెంకటేశ్వర కాలనీకి చెందిన బుక్కసాదుల మాధవి మెడలోంచి గుర్తు తెలియని దుండగులు వెనుక నుంచి బైక్‌పై వచ్చి ఆమె మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసు, రెండు మాసాల పుస్తెలను మెడలోంచి తెంపుకొని ఎత్తుకెళ్లారు.

బాధితురాలు మాధవి ఇంటి నుంచి రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి స్కూటీపై రేషన్ షాప్‌కు వెళ్లి బియ్యాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా.. వెనుక నుంచి బైక్ పై వచ్చి మంకీ క్యాప్, గ్రే కలర్ షర్ట్ ధరించిన వ్యక్తి మెడలోంచి బంగారు గొలుసును అపహరించుకుపోయినట్లు పేర్కొంది. గుర్తు తెలియని దుండగుడు మెడలోని బంగారు గొలుసు వెనుక నుంచి వచ్చి తెంపుకోగాని స్కూటీ పైనుంచి తను కింద పడిపోయినట్లు ఆర్మూర్ పోలీసుల వద్ద బాధితురాలు వాపోయింది. ఆర్మూర్లో దుర్గా మ్యాచింగ్ సెంటర్ నిర్వహణ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని.. బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దుండగుడిని పట్టుకుని శిక్షించి నాకు న్యాయం చేయాలని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు బుక్కసాదుల మాధవి, ఆమె భర్త నవీన్ లు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story