- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తొర్తి గ్రామం లో కుల బహిష్కరణ.. పట్టించుకోని మంత్రి ప్రశాంత్ రెడ్డి
దిశ ప్రతినిధి, నిజామాబాద్: మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం లోని ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో రెండు నెలలుగా మాల, మాదిగ, గుండ్ల, చాకలి కుమ్మరి, కమ్మరి, ముదిరాజ్, పద్మశాలి, గొల్ల ఇతర మైనారిటీ కులస్తులందరికీ సాంఘిక బహిష్కరణ విధించిన మున్నూరు కాపు వర్గం పై కేసులు నమోదు చేయాలని జరుగుతున్న ఆందోళనలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించాలని పివైఎల్ నాయకులు డిమాండ్ చేసారు. మంత్రి నియోజకవర్గంలోని గ్రామంలో బహిష్కరణ వివాదా పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ కుమార్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత రెండు నెలలుగా తొర్తి గ్రామంలో మున్నూరు కాపు సామాజిక వర్గం మాల, మాదిగలకు బహిష్కరణ విధించారు. అయితే వారికి ఇతర కులాలు అండగా ఉన్నందున ఆ ఇతర కులాల అన్నింటిని సాంఘిక బహిష్కరణ విధించి సపరేటుగా వైన్స్, కూల్ డ్రింక్స్, టీవీ డిష్ లు ఏర్పాటు చేయించారు. అలాగే ఆటోలలో తమ వర్గం వారు ఎక్కకుండా ఆంక్షలు విధించారు. గొర్రెలు తమ భూముల్లోకి మేతకు రాకుండా, గంగపుత్రుల వాళ్ళ చేపలు కొనకుండా, వడ్ల కమ్మరులకు పని ఇవ్వకుండా ఇలా అనేక కుల వృత్తుల వాళ్లకు పని ఇవ్వకుండా కొనకుండా బహిష్కరణ చేశారు. ఒకవేళ మీకు పని ఇవ్వాలన్న, కొనాలన్నా మాల మాదిగల తో మీరు దూరంగా ఉంటే మాతో కలిసి వస్తేనే మిమ్మల్ని కలుపుకుంటామని ఆంక్షలు విధిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.
దీనిపై స్థానిక అధికారుల వద్దకు వెళితే వాళ్లను మేనేజ్ చేస్తూ కాలయాపన చేస్తూ కేసులు నమోదు కాకుండా లాబీయింగ్ చేస్తున్నారన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన తొర్తి గ్రామంలో రెండు నెలలుగా బహిష్కరణ కొనసాగుతుంటే దాని పరిష్కారానికై స్పందించక పోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా మంత్రి జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, ఉపాధ్యక్షులు మారుతి గౌడ్, సహాయ కార్యదర్శి ఆల్గోటు సాయిలు, కోశాధికారి నారాయణ లు పాల్గొన్నారు.