బీఆర్ఎస్ మునిగే నావ . . . బీజేపీకి సింగిల్ డిజిట్​ సీటు కూడా రాదు

by Sridhar Babu |
బీఆర్ఎస్ మునిగే నావ . . . బీజేపీకి సింగిల్ డిజిట్​ సీటు కూడా రాదు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారత రాష్ట్ర సమితి అనేది మునిగే నావ అని, అది ఈ ఎన్నికల్లో గెలుస్తామని గ్లోబల్ ప్రచారం చేసుకుంటుందని, ఇక బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీటు కూడా రాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో షబ్బీర్ అలీ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో ఏక్ నాథ్​ షిండే లు తయారవుతారని , అతని అల్లుడు హరీష్ మరికొందరు అధికారం కోసం గొడవపడి బీఅర్ ఎస్ పార్టీ మూడు ముక్కలు కావాదం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దయనీయంగా ఉందని, ఆ పార్టీలో నాయకులు ఒక్కొక్కరుగా వీడి కాంగ్రెస్ లో చేరుతున్న విషయాన్ని మరువరాదన్నారు. ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్లు రావని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచి వెళ్లిన విషయం వాస్తవమేనని కానీ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నవాళ్లంతా 24 క్యారెట్ గోల్డ్ లాంటి వాళ్లన్నారు. జిల్లా కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, రెండుసార్లు మంత్రిగా , నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో తనకు సంబంధాలు ఉన్నాయన్నారు.

పేరు పెట్టి పిలిచేంత సత్సంబంధాలు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు చాలా మందితో తనకు ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజాప్రతినిధిగా తాను వెళ్లని ప్రాంతానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా గ్రామగ్రామాన తిరిగిన అనుబంధం ఉందన్నారు. తాను ఐఅండ్ పీఆర్ మినిస్ట్రర్ గా ఉన్నప్పుడే జర్నలిస్టు కాలనీలు ఏర్పాటు చేశానని, ప్రస్తుతం జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు తన హయాంలో ప్రారంభమైందన్నారు. తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే డిచ్ పల్లిలో 400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, నాటి నుంచి జిల్లాలో లక్ష విద్యుత్ పంప్ సెట్లకు విద్యుత్ కోత లేకుండా సరఫరా అవుతుందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే నిజామాబాద్

అర్బన్ కు చెందిన డీఎస్ మంత్రిగా ఉన్నప్పుడే నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డిలో ఇంటింటికి నీటి సరఫరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టమన్నారు. అందరి ఏకాభిప్రాయం మేరకే తెలంగాణ యూనివర్సిటీని జాతీయ రహదారిపై, వైద్య కళాశాలను నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ నగరంలో అభివృద్ది జరిగిందా లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తనకు స్వాగతం పలికారని, కాంగ్రెస్ లీడర్లు తన గెలుపు కోసం పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నిజమాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ దే విజయమని, తాను గెలిస్తే మాస్టర్ ప్లాన్ అమలు చేసి రింగు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నగర ప్రజలకు విద్య, వైద్యం ప్రజల చెంతకు అందించేలా పని చేస్తానన్నారు. ప్రస్తుతం అర్బన్ లో ఉన్న రెండు పార్టీల అభ్యర్థులు తనకు పోటీ కాదని షబ్బీర్ అలీ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed