బీజేపీ మేనిఫెస్టో చూశాక బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు వణుకుపుట్టింది

by Sridhar Babu |
బీజేపీ మేనిఫెస్టో చూశాక బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు వణుకుపుట్టింది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిన్న విడుదల చేసిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో చూశాక కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకి వణుకు పుట్టిందని, తాము గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీజేపీ ఇచ్చినా మాట నిలబెట్టుకుంటుందని ఆపార్టీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాదు నగరంలోని 6 వ డివిజన్ వినాయక నగర్ హనుమాన్ జంక్షన్ నుంచి బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు పసుపు బోర్డు ప్రకటన, అయోధ్య రామమందిర నిర్మాణం చేశామన్నారు. నిన్నటి మేనిఫెస్టో లో డిగ్రీ విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్, వృద్ధులకు ఉచిత కాశి, అయోధ్య యాత్ర, పుట్టిన ఆడపిల్లలకు 2 లక్షల డిపాజిట్, ఉజ్వల యోజన వారికీ ఉచితంగా 4 సిలిండర్ లు, సంవత్సరానికి 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్,

ఇండ్లు లేని నిరుపేదలకు ఉచితంగా ప్లాట్స్, పక్కా ఇండ్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. బీజేపీ మాట ఇచ్చిన తరువాత తప్పదు అన్నారు. ఉచిత విద్య, వైద్యం మీద దృష్టి పెట్టామని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించాలని అన్నారు. ఒక్కసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే అభివృధి చేసి చూపిస్తుంది అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమన్ని కోరుకుంటుంది అన్నారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని హారతులతో స్వాగతం పలికారు. భారీ గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో కొత్త వేణు, శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, పంచారెడ్డి లింగం, న్యాలం రాజు, కార్పొరేటర్లు బంటు వైష్ణవి, పంచారెడ్డి లావణ్య, సుక్క మధు, వనిత శ్రీనివాస్, ప్రవళిక శ్రీధర్, ఇందిరా వినోద్, మాస్టర్ శంకర్, ఇల్లేందుల మమతా ప్రభాకర్, మెట్టు విజయ్, ఎర్రం సుదీర్,ఇప్పకాయల సుమిత్ర కిషోర్, నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed