లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెడీ

by Mahesh |
లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెడీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రధాన రాజకీయ పార్టీలు మరో సమరానికి సన్నద్ధమవుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగియడంతో రానున్న పార్లమెంట్‌ ఎన్నికలపై పార్టీలు ఇప్పటినుంచే దృష్టి సారించాయి. ఇందు లో కాంగ్రెస్‌ ముందంజలో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించడంతో ముందు వరుసలో నిలిచింది. ఈ నెల రెండో వారంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న క్రమంలో బీజేపీ తెలంగాణలో పోటీ చేసే స్థానాలు తన అభ్యర్ధులను ప్రకటించింది. ఇందులో ఉమ్మడి జిల్లా రెండో సారీ సిట్టింగ్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంను, జహిరాబాద్ లో ఇటీవల బీజేపీలో చేరిన ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్ ను బరిలో నిలిపింది.

మొన్నటి వరకు బీఆర్ఎస్‌లో ఉన్న బీబీ పాటిల్ పార్టీ మారినప్పటి బీజేపీ సిట్టింగ్ ఎంపీ కావడంతో తన అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో బీజేపీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించే ముందు వరుసలో నిలిచింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దం తర్వాత అధికారం దక్కించుకోవడంతో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు కావడంతో జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉండటంతో నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలకు చాలా మంది ఆశవాహులు పోటీలో ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం జగిత్యాలలో రెండోసారి డాక్టర్ సంజయ్ చేతిలో ఓటమి పాలైనప్పటికి జీవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ పై కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంట్ పై దృష్టి కేంద్రీకరించాలి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలవడంతో అందులో నిజామాబాద్ జిల్లా ఉండటంతో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు తెలిసింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో కేవలం వంశీచంద్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించి మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనే లేదు. కాంగ్రెస్ తరుపున పోటీకి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

కానీ ఇప్పటికే ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైనల్ అని చర్చ జరుగుతున్న ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అదే కోవలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నుంచి పోటీ చేసేందుకు సురేష్ షెట్కార్ యోచన చేసిన పార్టీ ఆదేశాలతో విరమించుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ రేసులో ప్రముఖ వైద్యులు ఉజ్వల్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.కానీ కామారెడ్డి జిల్లా నుంచి జహీరాబాద్ పార్లమెంట్ రేసులో తామున్నామని ఆ ఒక్క లీడర్ ప్రకటించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ లో మొదటి నుంచి జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన ప్రస్తుత ఎల్లారెడ్డి శాసనసభ్యులు కలకుంట్ల మధన్ మోహన్ సిట్టింగ్ ఎంపీ బిబి పాటిల్ ను ఓడించి నంతగా పోటిలో అత్తెసరు మెజార్టితో ఓడిపోయారు.

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఉమ్మడి జిల్లా నిజామాబాద్, జహిరాబాద్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంలో పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో 2018 వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత తొలుత పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం ఆమెను పోటీ విషయంలో వెనుకంజ వేశారని చెప్పారు. పలు సందర్భాల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను వెంటాడి ఓడిస్తానని ప్రతిన బూనారు. అంతేకాకుండా పార్టీ నిర్వహించిన పలు సర్వేల్లో పార్టీకి అంతగా అనుకూలంగా లేదని ప్రచారం జరగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ముడు స్థానాలు గెలువడం, ఓట్ల శాతం పెరుగడంతో అక్కడ పోటి పై చాల మంది ఆసక్తి చూపుతున్నారు.

ప్రధానంగా మాజీ సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కో ఆర్డినేటర్ బిగాల మహేష్ గుప్తా పోటిలో ఉంటారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులతో చర్చించారని పార్టిలో చర్చ జరుగుతుంది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం పార్టీకి తీవ్ర కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున రెండు సార్లు ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ పార్టీని విడి బీజేపీలో చేరడమే కాకుండా సొంత పార్టీ పై పోటీకి సిద్ధం కావడంతో ఆ పార్టీలో కొత్త చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు బీబీ పాటిల్ కు మూడోసారి టికెట్ ఇవ్వవద్దని ఇస్తే సహకరించేది లేదని తెలిపిని బీఆర్ఎస్ నాయకులు ఆయన అనుహ్యంగా బిజేపి పంచనా చేరి తనను వద్దన్న వారిని ఓడిస్తానని బరిలో నిలుచుండడం ఆ పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ తరపున జహీరాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి మాజీ సభాపతి పోచారం తనయుడు డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి ఒక్కరే ఆ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. మరి ఎవరి పేరును తుది వరకు ప్రకటిస్తారో అనేది సస్పెన్స్‌గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed