బీఆర్​ఎస్​కు భారీ షాక్

by Disha Web Desk 15 |
బీఆర్​ఎస్​కు భారీ షాక్
X

దిశ, ఎల్లారెడ్డి : బీఆర్​ఎస్​కు భారీషాక్ తగిలింది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనా రాయణ బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పి బుధవారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే మదన్మోహన్ చేస్తున్న అభివృద్ధి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజలకు అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed