జార్ఖండ్ ప్రభుత్వ అవినీతి కథ అంతులేనిది: ప్రతుల్ షా డియో

by Disha Web Desk 12 |
జార్ఖండ్ ప్రభుత్వ అవినీతి కథ అంతులేనిది: ప్రతుల్ షా డియో
X

దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం పీఏ సంజీవ్ లాల్ నౌకర్ ఇంట్లో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో 25 కోట్లకు పైగా డబ్బులు పట్టుబడ్డాయి. ఇంట్లో ఎటు చూసిన నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా బయటపడటంతో అవాక్కయిన ఈడీ అధికారులు వాటిని లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లను తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. మంత్రి పీఏ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడంపై జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా డియో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్ ప్రభుత్వ అవినీతి యొక్క అంతులేని కథ ముగిసే సూచనలు కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం, ఒక ఇల్లు, కార్యాలయం నుండి 300 కోట్ల రూపాయల నగదు ఈడీ స్వాధీనం చేసుకుంది. తాజాగా.. రూ. 25 కోట్లకు పైగా నగదు బయటపడింది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మంత్రులు ఏ మేర అవినీతి చేస్తున్నారో అర్ధమవుతుందని అన్నారు. అలాగే ఈ కేసులో నిందితులను వెంటనే కస్టడీలోకి తీసుకుని పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed