- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ముంబై మహా నగరంలో హై అలర్ట్.. బాంబు పేలబోతోందంటూ ఆగంతకుడి ఫోన్ కాల్
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబై మహా నగరంలో పొలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఉన్న మెక్‌డొనాల్డ్‌లో బాంబు పేలబోతోందనంటూ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఆ కాల్ చేసిన వ్యక్తి ఓ కీలక విషయం చెప్పాడు. తాను బస్సుులో వెళ్తుండగా.. మెక్‌డొనాల్డ్‌ను పేల్చివేయడం గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం విన్నానని.. అందుకే కంట్రోల్ రూంకు కాల్ చేసినట్లుగా తెలిపాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు పెట్టారని చెబుతున్న స్పాట్‌కు వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎలాంటి అనుమాస్పద వస్తువులు కనబడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఫోన్‌లో సమాచారం ఇచ్చిన వక్తి ఎవరనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story