మరోసారి అద్దంకి దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎన్నికల వేళ ఇరకాటంలో కాంగ్రెస్

by Disha Web Desk 12 |
మరోసారి అద్దంకి దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎన్నికల వేళ ఇరకాటంలో కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అతనిపై హిందూ సంఘాల నేతలు, బీజేపీ ఫైర్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ పాల్గొన్న సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. నేడు తెలంగాణలో మేము హిందువులం హిందువులం అని చెప్పుకుంటున్నారు. రాముడు మీకు చిన్నయ్యనా.. లేక సీత మీకేమైనా చిన్నమ్మనా.. మీరేమైనా రాముని వంశం లో పుట్టారా.. వీళ్లకు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు. రాముడు అసలు ఏం చేసిండో వీళ్లకు తెలియదంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా హిందువులను కించపరిచే ల మాట్లాడిన అద్దంకి పై చర్యలు తీసుకోవాలని.. నెటిజట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ అద్దంకి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. ఇప్పటికే హిందు వ్యతిరేక పార్టీగా బీజేపీ విమర్శలు చేస్తుండగా తాజాగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు.. వారిని ఇరకాటంలోకి నెడుతుందని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story

Most Viewed