ఏపీలో సీన్ రివర్స్..ఆ పార్టీకి అనూహ్యంగా పెరుగుతున్న మద్దతు!

by Disha Web Desk 18 |
ఏపీలో సీన్ రివర్స్..ఆ పార్టీకి అనూహ్యంగా పెరుగుతున్న మద్దతు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు వారం రోజులే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల నేతలు సభలు, సమావేశాలు, రోడ్‌షో లతో హోరెత్తిస్తున్నారు. ఇక మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో జగన్‌ను గద్దె దించడమే ధ్యేయంగా టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు ఖాయమని కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాక గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందనే దానిపై పలు నివేదికలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రముఖ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం..రాష్ట్రంలో పురుషులు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని మహిళలు మాత్రం ఏకపక్షంగా వైసీపీ వైపు ఉన్నట్టు తేల్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 50.18 శాతం మంది పురుషులు కూటమి వైపు మొగ్గు చూపారు. అదే వైసీపీ విషయానికి వచ్చేసరికి 46.5% మంది మద్దతు తెలిపారు. ఇక్కడ టీడీపీ కూటమికి మూడు శాతం మంది అదనంగా మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. మరోవైపు మహిళలు 56.12% వైసీపీ వైపు మొగ్గు చూపగా టీడీపీ కూటమికి కేవలం 41.21% మంది మద్దతు తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఏపీ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Read More..

జనసేనానికి ఐక్యరాజ్యసమితి ఆహ్వానం..ఈ నెల 20న న్యూయార్క్ టూర్

Next Story

Most Viewed