- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యాశాఖ బిగ్ మిస్టేక్ .. నిరుద్యోగి జీవితంతో ఆటలు
దిశ, గాంధారి: విద్యాశాఖ అధికారుల తప్పిదానికి అమాయకుడు బలయ్యాడు. టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యానన్న అతడి ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామానికి చెందిన కారంగుల సాయి రెడ్డి ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్ష రాసి దాంట్లో ఎలాగైనా సెలెక్ట్ అవుతానని ధీమాతో ఉన్నాడు. ఇటీవల వెలువడిన ఫలితాల నేపథ్యంలో డీఈఓ కార్యాలయం నుంచి ఫోన్ రాగానే అతని ఆశలు చిగురించాయి. చివరికి వేరే వ్యక్తి పేరు బదులు తన పేరు లిస్ట్ లోకి చేర్చారన్న విషయం తెలుసుకుని సాయిరెడ్డి ఖంగుతిన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మొన్న జరిగిన డీఎస్సీ 2024 నియామకాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లో సెలెక్ట్ అయ్యారు. మీకు మెసేజ్ కూడా వచ్చిందని జిల్లా విద్యాశాఖ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి సాయిరెడ్డికి చెప్పారు. మరుసటి రోజు ఉదయం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి హైదరాబాద్ సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంది. అంతేకాకుండా అదే రోజు రాత్రి 8 గంటలకు మెసేజ్ కూడా వచ్చింది. అంతా బాగానే ఉంది అనుకొని తీరా 9వ తేదీన ఎల్బి నగర్ వెళ్లడానికి బస్సులకు అతికించిన సెలెక్టెడ్ లిస్టులో సాయి రెడ్డి పేరు ఉండడంతో అతను కూడా సంతకం పెట్టి వెళ్లి బస్సులో కూర్చోవడం జరిగింది. సెలెక్టెడ్ లిస్టులో ఉన్న బస్సులో కూర్చున్న అభ్యర్థులకు అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంతవరకు బాగానే జరిగింది కానీ సీఎం ప్రోగ్రాం వెళ్లేందుకు కూడా సీఎం పాస్ కూడా సాయి రెడ్డికి ఇచ్చారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే సీఎం ప్రోగ్రాం కంప్లీట్ అయిన తర్వాత కూడా సాయిరెడ్డి కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు దీంతో ఒక్కసారిగా సాయి రెడ్డి వెళ్లి జిల్లా విద్యాశాఖ అధికారి రాజును వివరణ అడిగారు. చిన్న మిస్టేక్ వల్ల ఒకరికి రావాల్సిన ఉద్యోగం సాయిరెడ్డికి వచ్చిందని జిల్లా విద్యాశాఖ అధికారి సమాధానం ఇచ్చారు.
కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ను కలవనున్న సాయి రెడ్డి..
తనకు జరిగిన తీరును వివరిస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను కలవనున్నట్లు సాయి రెడ్డి తెలిపారు. అయితే కలెక్టర్ శుక్రవారం అందుబాటులో లేకపోవడంతో ఇన్వార్డ్ లో తన ఫిర్యాదు దరఖాస్తును ఇవ్వడం జరిగిందని.. దసరా తర్వాత కలెక్టర్ ను వచ్చి కలుస్తానని తెలిపారు. విద్యాశాఖ అధికారుల నుంచి ఫోన్ రావడం అంతేకాకుండా గవర్నమెంట్ మెసేజ్ కూడా రావడం బస్సు పై తన పేరు తాను చేసిన సంతకం కూడా ఉండడం వీటన్నిటిని కలిపి కలెక్టర్ కు అందజేయడం జరిగింది. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సాయి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు చేసిన చిన్న పొరపాటుతో ఉద్యోగం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు గుండె నిబ్బరం లేకపోతే వారి పరిస్థితి ఏంటి... జిల్లాస్థాయి అధికారులకు ముఖ్యంగా డీఈఓకి చిన్న పొరపాటుగా కనిపిస్తుంది కావచ్చు. కానీ మా భవిష్యత్తు అందులో ఉంది సార్ ఆఫ్ మార్క్ కోసం అహర్నిశలు కష్టపడ్డాం అంటూ కలెక్టర్ తో తన ఆవేదన వ్యక్తం చేశారు.