ఐష్ - అభిషేక్ విడాకులు.. సీక్రేట్స్‌ని కాపాడే ప్రయత్నం చేస్తానంటూ తొలిసారి స్పందించిన బిగ్ బీ..!

by Kavitha |
ఐష్ - అభిషేక్ విడాకులు.. సీక్రేట్స్‌ని కాపాడే ప్రయత్నం చేస్తానంటూ తొలిసారి స్పందించిన బిగ్ బీ..!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపూల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో జంటగా నటించిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. అయితే గత కొన్ని నెలలుగా ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఈ జంట స్పందించలేదు. అయినప్పటికీ వీరి డివోర్స్ వార్తలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఐష్, అభిషేక్ విడాకుల వార్తలపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘బేసిక్‌గా నేను నా ఫ్యామిలీ గురించి చాలా తక్కువగా మాట్లాడుతాను. ఎందుకంటే అది నా డొమైన్. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన సీక్రేట్స్‌ని కాపాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలు. మీడియా వారు వారి వృత్తికి సంబంధించిన పనులు చేసుకుంటే మంచిది. అయితే వారు సమాజానికి సేవ చేయడంలో చేసే వారి ప్రయత్నాన్ని సమర్థిస్తాను. కానీ, అవాస్తవాలు లేదా అనుమానాలు, ఊహాజనిత వార్తలు రాయడం సరికాదు. అలాగే అనుమానం అనే విత్తనం నాటకూడదు, పాఠకులు దానిని విశ్లేషించాలి.. ఏదైనా సరే నిజం తెలుసుకున్న తర్వాతనే వార్తలు రాయాలి’ అంటూ అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఐష్, అభిషేక్ విడాకులపై వస్తున్న వార్తలన్ని పుకార్లు మాత్రమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story