- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డి కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు
by Sumithra |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బతుకమ్మ పండుగ తెలంగాణలో వారసత్వంగా వస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో శుక్రవారం టీఎన్జీవోస్, ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడుతూ పూలను పూజించే పండగ బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మను తొమ్మిది రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం అవకాశమిచ్చిందని చెప్పారు.
మహిళలు, చిన్నారులు సంతోషంగా సంబరాల్లో పాల్గొనాలని సూచించారు. మహిళలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అందంగా పేర్చిన బతుకమ్మలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డీఆర్ డీఓ సాయన్న, సీపీఓ రాజారాం, టీఎన్ జీఓ జిల్లా కార్యదర్శి సాయిలు, దేవేందర్, దేవరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story