ఆర్మూర్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్..

by Kalyani |
ఆర్మూర్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్..
X

దిశ, ఆర్మూర్ : బంగ్లాదేశ్ దేశంలోని హిందువులపై జరిగిన హత్య దాడులకు నిరసనగా ఆర్మూర్ లో శనివారం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హిందువుల పై దాడులకు నిరసనగా ఆర్మూర్ సర్వ సమాజ్ పిలుపునివ్వగా, ఈ బందుకు ఆర్మూర్ పట్టణ బిజెపి నాయకులు సైతం మద్దతు తెలిపారు. దీంతో శనివారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని వ్యాపార సముదాయాలు, దుకాణాలు నిర్వాకులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతం తో పాటు కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, రామారెడ్డి, భిక్కనూర్ తదితర మండలాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు రోడ్లపై పహారా కాస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed