కాల్పోల్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులపై దాడులు

by Kalyani |
కాల్పోల్ అటవీ ప్రాంతంలో  అటవీశాఖ అధికారులపై దాడులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో సాగు పనులు చేస్తున్నారని ట్రాక్టర్ తో దుక్కి దున్నడం జరుగుతుందని నిజామాబాద్ సౌత్ రేంజ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. విషయం తెలిసిన సౌత్ అటవీశాఖ రేంజ్ అధికారి రాధిక, అటవీశాఖ బీట్ అధికారులు బైరాపూర్ ప్రగతి, బద్రి , సెక్షన్ అధికారి సాయి కృష్ణ లు కాల్పోల్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సాగు చేస్తున్న గిరిజనులను అడ్డుకొని , ట్రాక్టర్లను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు.

దానితో గిరిజనులు వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఒకరికి చేతు విరిగినట్టు ,అలాగే మహిళ అధికారినికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అధికారుల సమాచారంతో మోపాల్ పోలీసులు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ గిరిజనులు ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వగా అక్కడే సాగు చేసుకుంటామని వాదనకు దిగారు.

Next Story

Most Viewed