కల్లు దుకాణంపై దాడి

by Sridhar Babu |
కల్లు దుకాణంపై దాడి
X

దిశ, లింగంపేట్ : లింగంపేట మండలంలోని బంగారం గ్రామంలో కల్లు దుకాణంపై దాడి చేసి రెండు గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ తెలిపారు. శనివారం సాయంత్రం లింగంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని మెంగారం గ్రామంలో ఆల్పాజోలం వినియోగించి కల్తీ కల్లు చేస్తున్నట్టు నమ్మదగిన సమాచారం ఎస్సై చైతన్య కుమార్ రెడ్డికి వచ్చినట్లు తెలిపారు. ఎస్సై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం కల్లు దుకాణంపై దాడి చేసినట్లు తెలిపారు. ఎస్ఐ కల్లు దుకాణం పై దాడి చేసిన సమయంలో కల్లు మూస్తేదారు గోవర్దన్ గౌడ్ వద్ద రెండు గ్రాముల ఆల్ఫాజోలం లభించినట్లు తెలిపారు.

గోవర్దన్ గౌడ్ వద్ద లభించిన మత్తు పదార్థం విలువ 40 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. కల్లు విక్రయదారుడి వద్ద ఆల్ఫాలోజం లభించడంతో కల్లు సీసాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. సీజ్ చేసిన కల్లు సీసాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపనున్నట్లు సీఐ వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని లింగంపేట్, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలంలో ఇప్పటివరకు ఆరు కల్తీ కల్లు కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలోని ఆయా మండలాల్లో కల్లు దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది రాజేందర్, రమేష్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story