అరవింద్ ఎంతో అభివృద్ధి చేశారు

by Disha Web Desk 15 |
అరవింద్ ఎంతో అభివృద్ధి చేశారు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి అరవింద్ సమర్థవంతమైన నాయకుడని, మోడీ ఆశీస్సులతో నిజామాబాద్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, గత ఎన్నికల్లో కంటే రెట్టింపు మెజారిటీతో అరవింద్ ను గెలిపిస్తారని నమ్మకం ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి అన్నారు. గురువారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నామినేషన్ అనంతరం నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో పుష్కర్ సింగ్ మాట్లాడుతూ... తెలంగాణ ఒక దేవ భూమని, ఈ నేలకు కోటి వందనాలు అని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని, దేశ రక్షణ విషయంలో సైనికులు స్వేచ్ఛగా వ్యవహరించ గలుగుతున్నారు అని తెలిపారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తీవ్రవాదులను అంతం చేయలేకపోయారు అని గుర్తు చేశారు. మోడీ పాలనలో ఒకే దేశం ఒకే న్యాయం అమలు అవుతుందని, అందుకు దశాబ్ద కాలం పాలన నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను మైనార్టీ సంక్షేమం కోసం వాడుతారు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హీన చరిత్రను వినేందుకు దేశ ప్రజలు సిద్ధంగా

లేరని ప్రియాంక గాంధీకి చెబుతున్నా అని పుష్కర్ సింగ్ అన్నారు. దేశంలోని 140 కోట్ల భారతీయులను సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ మోడీ పరిపాలన చేస్తున్నారు అని తెలిపారు. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో నాలుగు దశాబ్దాల పసుపు రైతుల ఆకాంక్షను నెరవేర్చామని, పసుపు బోర్డు ఏర్పాటు పై ప్రధాని మోడీ ప్రకటన చేసి ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆసియా ఖండం ప్రజలకు చక్కెరను అందించిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఒకవైపు మోడీ ప్రభుత్వం దేవభూమి పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే, ముస్లిం పర్సనల్ లా అమలుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రజలను దోచుకునే పార్టీలు అని, ఈ రెండు పార్టీలు ఒకటే అని ఆరోపించింది. అబద్దపు హామీల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, హామీలను అమలు చేయలేక చేతులు ఎత్తివేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో 2 జీ స్పెక్ట్రాం, 3 జీ స్పెక్ట్రాం కుంభకోణాలతో పాటు, నేషనల్ హెరాల్డ్ పేరిట జరిగిన కుంభకోణాలు ప్రజలు మర్చిపోలేదు అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న బీఆర్ నేతలపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని ప్రశ్నించారు. రెండు పార్టీలు పరస్పర ఒప్పందాలు చేసుకున్నాయని దుయ్యబట్టారు. మోడీని అడ్డుకునేందుకు అన్ని పార్టీలు ఒక్కటవుతున్నాయని, విదేశాల నుంచి వీరికి ఫండింగ్ కూడా వస్తుందని ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ధర్మపురి అరవింద్ ను ఆదరించాలని కోరారు. అరవింద్​ను భారీ మెజార్టీతో గెలిపించి మోడీని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంటుందని అన్నారు.

జీవితంలో ఎన్నడూ రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు : ఎంపీ అరవింద్

దేశ ప్రధాని కావాలని రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నాడని, ఆయన ఎన్నటికీ ప్రధాని కాలేడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 2019 లో నాపై నమ్మకం తో అన్నివర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించారని, అందరి ఆశీర్వాదంతో ఇచ్చిన హామీలను నెరవేర్చాను అని గుర్తు చేశారు. ఐదేళ్లలో ఒక్క అవినీతి మరక లేకుండా వేలాది కోట్ల రూపాయలతో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అభివృద్ధి పనులు చేశాను అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజల కల అయిన జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ విషయంలో ప్రభుత్వంతో పోరాడి సాధిస్తా అన్నారు. పొట్టకూటి కోసం లక్షలాదిమంది తెలంగాణ వాసులు ఎడారి బాట పట్టారని, తెలంగాణ ప్రవాస భారతీయులకు రాజకీయాల కతీతంగా సేవలు అందిస్తున్నాం అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నారైలు ,

గల్ఫ్ కార్మికులపై దొంగ ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికులకు ఒక్క సంక్షేమాన్ని కూడా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏ శాఖ పరిధిలో ఉంటదో కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలవదు అని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు శాఖలో ఉంటది వ్యవసాయ శాఖలో కాదు అది తెలుసుకోవాలన్నారు. నాలుగు జిల్లాలకు ఎమ్మెల్సీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి మరీ అబద్ధాలు ఆడుతున్నాడని, 45 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క మంచి పని కూడా చేయలేదు అని ఆరోపించారు. భారతదేశంను ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని, ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడిగా మోడీ కీర్తింపబడుతున్నారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల ఆస్తులు అన్ని ముస్లింలకు ఇస్తానంటుందని,

దుబాయ్, అబుదాబి లాంటి దేశంలో కూడా మందిరాలు నిర్మిస్తున్నారు అంటే అది మోడీ గొప్పతనం అని గుర్తు చేశారు. హిందువుల్లో ఆభద్రతాభావం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక వర్గానికి మేలు చేకూర్చేలా ఉంది అని, దానిని పరిశీలిస్తే అర్ధమవుతుందన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి హిందువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆసన్నమైందన్నారు. జీవితంలో ప్రతి భారతీయుని అత్యంత ప్రధానమైన ఎన్నికలు ఇవని, ఇప్పుడు ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోసారి తనకు అవకాశం ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ సెల్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed