అరవింద్, జీవన్ రెడ్డి దొందు దొందే.. జిల్లా ప్రజలకు చేసింది శూన్యం : బాజిరెడ్డి గోవర్ధన్

by Aamani |
అరవింద్, జీవన్ రెడ్డి దొందు దొందే.. జిల్లా ప్రజలకు చేసింది శూన్యం : బాజిరెడ్డి గోవర్ధన్
X

దిశ,నిజామాబాద్ సిటీ : మోపాల్ మండలం, నర్సింగ్ పల్లి గ్రామంలో ఎస్ఆర్ఎస్ గార్డెన్లో మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ...అరవింద్, జీవన్ రెడ్డి లు.. దొందు దొందే అని .. నిజామాబాద్ జిల్లా ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఏ ఒక్కనాడైనా మోపాల్ మండల ప్రజల వద్దకు వచ్చి మంచి చెడు అడిగారా, లేదా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికి అయినా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా,.. ఇక బీజేపీ పార్టీకి వస్తే గెలిచి ఐదు సంవత్సరాలు అవుతుంది, ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఎక్కడ, జిల్లా ప్రజలకు అరవింద్ ఎక్కడుందో చూపించాలి... ఇంట్లో ఇద్దరు ఇద్దరు ఎంపీలు, డి శ్రీనివాస్, అరవింద్ తండ్రి కొడుకులు, ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఇద్దరు ఉన్నప్పుడే చెయ్యని వారు... ఇప్పుడు ఎలా చేస్తారు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు దురాశకు పోయి దుఃఖాన్ని తెచ్చుకున్నారు... కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలను నమ్మి మోసపోయారన్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను అన్నారు ఎక్కడ... గత కాంగ్రెస్ పాలనలో 200 ఉన్న పింఛన్ ని రెండు 2000 వేల కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఎక్కడ... మూడు పంటలకు ఇస్తానన్న రైతుబంధు ఎక్కడ... 24 గంటల కరెంటు ఎక్కడ... రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ... కాంగ్రెస్ పార్టీ 420 హామీలు.. ప్రజలకు అబద్ధం చెప్పి.. అధికారం ఎక్కారు.. ప్రజలను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. స్థానికంగా ఉన్న ఎంపీ నిజామాబాద్ కు చేసింది శూన్యం మని,. ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా రాలేదు.. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలు నిలదీయండి, మా గ్రామానికి రూపాయి అయినా ఇచ్చారని అడగండి, రూపాయి తెచ్చే ముఖం లేదు పనిచేసే ముఖం లేదు సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ కాలమెల్ల తీయడం తప్ప ప్రజలకు చేసింది శూన్యం కావున రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్ లో బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్తారని ఎంపి అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు,మాజీ ఎమ్మెల్సీ విజి గంగాధర్ గౌడ్ , జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ , జడ్పిటిసి కమల నరేష్, మండల అధ్యక్షులు శ్రీనివాస్, ముత్యాన్న, శ్రీనివాస రావు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన,బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed