Arrest :పేకాట రాయుళ్ల అరెస్ట్…పట్టుబడిన వాళ్లందరూ ప్రముఖులే

by Kalyani |
Arrest :పేకాట రాయుళ్ల అరెస్ట్…పట్టుబడిన వాళ్లందరూ ప్రముఖులే
X

దిశ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు శుక్రవారం రాత్రి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు పోలీసులు రైడింగ్ నిర్వహించి పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకున్నారు. ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో పిట్లం మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్లు లో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో రైడింగ్ చేసి 9 మందిని పట్టుకొని పిట్లం పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

పట్టుకున్న వారిలో పెద్ద కొడపగల్ తాజా మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి, చిన్న కొడపగల్ సర్పంచ్ భర్త శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ ఆర్టీవో ప్రకాష్, పిట్లం ఎంపీపీ భర్త విజయ్, నారాయణఖేడ్ కి చెందిన జితేందర్ (జిత్తు ) వ్యాపారవేత్త సుధాకర్, రైస్ మిల్ నిర్వాహకుడు బెజుగం రామకృష్ణ, షేక్ సాబేర్, సిద్ధిరాములు, ఉన్నట్లు ఆయన తెలిపారు. వీరి నుంచి ఐదు కార్లు, ఒక బుల్లెట్ వాహనం, 9 మొబైల్ ఫోన్లు, రెండు లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం వీరిని పిట్లం పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed