తప్పిపోయిన చిన్నారిని గంటలోగా తండ్రి వద్దకు చేర్చిన ఆర్మూర్ పోలీసులు

by Sridhar Babu |
తప్పిపోయిన చిన్నారిని గంటలోగా తండ్రి వద్దకు చేర్చిన ఆర్మూర్ పోలీసులు
X

దిశ, ఆర్మూర్ : తప్పిపోయిన చిన్నారి పాపను ఒక గంటలోగా పోలీసులు తండ్రి వద్దకు చేర్చిన సంఘటన మంగళవారం ఆర్మూర్లో చోటు చేసుకుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రాజారాం నగర్ కాలనీలోని షేక్ నహీం కూతురైన మూగ పాప షేక్ మహేరా (7) తప్పిపోయిందని పాప తండ్రి 100 కి డయల్ చేసి పోలీసులకు వివరాలు తెలిపారు. దీంతో సమాచారాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ కు వివరాలు వెల్లడించారు. దీనికి ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ ఆర్మూర్ లోని పోలీస్ సిబ్బందిని తప్పిపోయిన పాపను వెతకడం కోసం గాలింపు చర్యలకు ఆదేశించారు. దీంతో ఆర్మూర్ పోలీస్

సిబ్బంది ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేశారు. రాజా రామ్ నగర్ కాలనీకి చెందిన ఆ చిన్నారి పాప మామిడిపల్లి చౌరస్తాలో వరకు వెళ్లింది. ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ ఆదేశాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్న కానిస్టేబుల్ రాములు, హోంగార్డ్ మాదరి స్వామి అటువైపుగా తిరుగుతున్న పాపను మామిడిపల్లి చౌరస్తాలో పట్టుకుని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. వెంటనే ఆ పాప తండ్రి కి ఫోన్ కాల్ చేసి ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ సమక్షంలో ఆ పాపను తండ్రికి అప్పగించారు. తప్పిపోయిన పాపను చాకచక్యంతో పట్టుకున్న కానిస్టేబుల్ రాములు, హోంగార్డ్ మాదరి స్వామిలను ఎస్హెచ్ఓ రవికుమార్ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed