- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Komatireddy: ఆ మనిషి పత్తా లేకుండా పోయారు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు చట్టసభలు, వ్యవస్థల మీద ఏమాత్రం గౌరవడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడుసార్లు అసెంబ్లీ పెట్టిన ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదని గుర్తు చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడి హోదాలో ప్రతిరోజు హాజరయ్యారని గుర్తుచేశారు. చట్టసభల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవం అది చెప్పుకొచ్చారు. 2023 ఎన్నికల్లో కుర్చీ వేసుకుని కూర్చుని బాలు నాయక్‌ను ఓడిస్తానన్న మనిషి పత్తా లేకుండా పోయారన్నారు. లక్షన్నర కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా, అది కూలిందన్నారు. నల్గొండకి అవసరమైన ఎస్ఎల్బీసికి రూ. 2000 కోట్లు ఇవ్వలేదన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ పట్టుబట్టి నిధులు కేటాయించుకొని, అమెరికా వెళ్లి మిషన్ రిపేర్‌కి చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. నవంబర్, డిసెంబర్ లో రెండు మిషన్ల ద్వారా పనులు మొదలుపెట్టి 30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
నాగార్జునసాగర్, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలతో పాటు నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. దుర్మార్గుడు కేసీఆర్ నల్గొండ జిల్లాకు జీవనాడిలాంటి ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేసిండన్నారు. అందుకే, దేవుడు ఆయనను ఫాంహౌజుకు పరిమితం చేసిండన్నారు. తమది రైతు ప్రభుత్వమని, 50 కిలోమీటర్ల సొరంగం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. వర్షాలు మీద ఆధారపడకుండా సొరంగం ద్వారా గ్రావిటీపై నీళ్లు ఇచ్చేలా చూస్తున్నామన్నారు. మిషన్ భగీరథకు రూ. 6 వేల కోట్లు ఖర్చు పెట్టినమని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు, ఏ ఊర్లో నీళ్లు సరిగా వస్తున్నాయో చెప్పాలని తాను అడుగుతున్నానని అన్నారు. పనికిరాని పథకాలన్నీ పెట్టి ఎనిమిది లక్షలు అప్పు చేసిండన్నారు. కల్వకుర్తికి వెళ్లే జాతీయ రహదారి తమ శాఖ ద్వారా మంజూరు చేశామన్నారు. 18 వేల మంది రైతులకు రెండు లక్షల పైన రుణాలను మాఫీ చేసిన ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. 2 లక్షలకు పైగా ఉన్న లోన్లు ఉన్న రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు.