డిజిటల్ కార్డు ద్వారానే అన్ని సంక్షేమ పథకాలు : మంత్రి పొంగులేటి

by Aamani |
డిజిటల్ కార్డు ద్వారానే అన్ని సంక్షేమ పథకాలు : మంత్రి పొంగులేటి
X

దిశ, ఆమనగల్లు( కడ్తాల్ ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డిజిటల్ కార్డు ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.రూ. 1.18 కోట్లతో నిర్మించిన కడ్తాల్ మండల తహసీల్దార్ నూతన భవనాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,జిల్లా కలెక్టర్ శశాంక్ తో కలిసి ఆయన ప్రారంభించారు.అనంతరం తహసీల్దార్ ముంతాజ్ బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు రూ. 2 లక్షల లోపు రుణమాఫీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.ధరణి ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతులకు కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 అమల్లోకి తెచ్చి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.సాగు చేసుకుంటున్న ప్రతి రైతుకు డిసెంబర్ లోపు పట్టాలు అందజేస్తామని అన్నారు.

జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి : ఎమ్మెల్యే నారాయణరెడ్డి

కల్వకుర్తి నియోజకవర్గంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కడ్తాల్ మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రతి మండలంలో సర్వేయర్లను నియమించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.అనంతరం ఆమనగల్లు ఎక్సైజ్ శాఖ పరిధిలోని 75 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు,అదేవిధంగా ఆమనగల్లు,కడ్తాల్, తలకొండపల్లి మండలాల ఆడపడుచులకు 77 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు సభ్యులు బాలాజీ సింగ్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి,పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్,ఎమ్మార్వో లలిత,ఎంపీడీవో సుజాత,సిఐలు శివ, ప్రమోద్ కుమార్, ఎక్సైజ్ సీఐ బైధ్యనాథ్ చౌహన్, ఎస్ఐలు వెంకటేష్, వరప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed