CM రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య శ్రీనివాస్

by Rajesh |
CM రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య శ్రీనివాస్
X

దిశ, ఆర్మూర్ : సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి అయ్యప్ప లావణ్య శ్రీనివాస్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య శ్రీనివాస్ పట్టు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్‌లు కశ్యప్ స్వాతి సింగ్ బబ్లు, పండిత్ వినీత పవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ షైక్ మున్ను, ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు మేడిదాల సంగీత రవి గౌడ్, ఆకుల రాము, శాల ప్రసాద్, ఎస్ ఆర్. సుజాత రమేష్, ఇట్టేడి నర్సారెడ్డి, అథిక్, ఫయాజ్, ఇంతియాజ్, కొంతం మంజుల మురళి, వనం శేఖర్, లింగంపల్లి భాగ్య శివ, డార్లింగ్ రమేష్, తాటి హన్మాండ్లు, సుంకరి ఈశ్వరి రంగన్న, బాదం రాజ్ కుమార్, రింగుల భారతి భూషణ్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి బాబా గౌడ్, ఆర్మూర్ పట్టణ నాయకులు అజ్జు భాయ్, ఫాయీమ్ భాయ్, గడ్డం మారుతి రెడ్డి, రాజు భాయ్, ఎన్ వి. రవీందర్ రెడ్డి(చిట్టి), జిమ్మీ రవి , భుపేందర్, హాబీబ్, మెహమూద్ అలీ, బబ్లు, శ్రీకాంత్ తదితర నాయకులు కలిశారు.

ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ మున్సిపల్ నూతన భవన నిర్మాణ పనులకు, అభివృద్ధి పనులకు నిధులను కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి త్వరలోనే ఆర్మూర్ మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి, అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story