ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, హైదరాబాద్ ఐపీఈతో ఒప్పందం...

by Sumithra |
ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, హైదరాబాద్ ఐపీఈతో ఒప్పందం...
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వాణిజ్య శాస్త్ర విభాగానికి, హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ)తో అవగాహన ఒప్పందం చేసుకున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డా. వై.వేణు ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా కళాశాల విద్యార్థులకు, అధ్యాపకులకు పరిశోధనకు సంబంధించి, సిలబస్ లో మార్పులు చేర్పులు, ఇంటర్న్షిప్ కు అవకాశం ఉంటుందన్నారు.

కళాశాల ప్రతినిధులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.వేణు ప్రసాద్, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి.లింగన్న ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నట్లు వివరించారు. ఐపీఈ ప్రతినిధులు డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి, ప్రొఫెసర్ వై.రామకృష్ణ, ఇతర సభ్యులు ఉన్నట్లు చెప్పారు.

Advertisement

Next Story