- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా కాలనీ సమస్యలు పట్టవా ..?
దిశ, పిట్లం : ప్రభుత్వాలు మారిన, పథకాలు మారిన తమ బతుకులు మారే పరిస్థితిలో లేవని పిట్లం బుడగ జంగం కాలనీకి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం 15 రోజుల నుంచి తమ కాలనీలో నీటి సమస్యపై అనేక పర్యాయాలు గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన తమను పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. శుక్రవారం నాడు రోడ్డుపై బైఠాయించి నీటి సమస్యను తొలగించాలని ఖాళీ బిందెలతో వారి సమస్యలను వెళ్లబుచ్చారు. కాలనీలలో వెయ్యి కుటుంబాలకు పైగా జీవిస్తున్నామని అలాంటిది మా కాలనీలో నీటి సరఫరా కోసం ఒక నీటి ట్యాంకును సైతం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని అన్నారు.
సెంటర్ లైటింగ్ పనులలో భాగంగా రోడ్డు విస్తీర్ణం పనులు కొనసాగిస్తున్నారు. ఇందులో బోర్ పైపులైన్లు పగిలిపోయి తమ కాలనీకి నీరు రావడంలేదని నీటి కోసం కాలనీలో అందరూ చందాలుగా జమ చేసుకొని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే అది సైతం చెడిపోవడంతో నీరు రావడంలేదని నీటి కోసం ఎక్కడకి వెళ్లిన అందరూ నీరు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని వారు తెలిపారు. దీంతో విసుగు చెందిన కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి తమ సమస్యను పరిష్కరించేంతవరకు జరిగేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.
దీంతో గ్రామపంచాయతీ సిబ్బంది అక్కడికి చేరుకొని ఎంతగా సముజాయించినప్పటికీ సమస్యను పరిష్కరించితే తప్ప రోడ్డును కాలి చేసే ప్రసక్తే లేదని సిబ్బందితో వాగ్వివాదానికి దానికి దిగారు. దీనిపై జిల్లాస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాలనీవాసులు తెలిపారు. సమస్య ఉధృతం కావద్దన్న ఉద్దేశంతో రంగంలో దిగిన పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పి ఈరోజు సాయంత్రం వరకు సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకోని విరమించారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టించుకోలే
విభూతి, అనిత.
పిట్లం బుడగ జంగం కాలనీ వాసి.
గ్రామపంచాయతీ అధికారికి మా కాలనీలో తలెత్తిన నీటి సమస్యపై అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులతోవడంతో పైపులైన్ దెబ్బతిని నీటి సమస్య తలెత్తింది. విసుగు చెంది సమస్య పరిష్కారం కొరకు రోడ్ కలిసిన పరిస్థితి ఏర్పడింది.
మా కాలనీలో ఒక్క వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదు.
ఉప్పరి సాయవ్వ.
బుడగ జంగం కాలనీ వాసి.
వెయ్యి మందికి పైగా జనాభా ఉన్న మా కాలనీలో అవసరార్థం ఒక్క వాటర్ ట్యాంకులు సైతం ఏర్పాటు చేయలేరు. దీంతో ప్రతి సంవత్సరం ఎండాకాలంలో కాకుండా అన్ని కాలలొ కూడా నీటి సమస్య ఏర్పడుతుంది. సమస్య తలెత్తినప్పుడల్లా నీటి కోసం వేరే బోరు బావుల వద్దను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి జి పి అధికారుల నిర్లక్ష్యమే కారణం.