జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

by Sridhar Babu |
జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం
X

దిశ, కామారెడ్డి : గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులను నియమించారు. మండల పరిషత్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్, ఉపాధి హామీ, వ్యవసాయ, మిషన్ భగీరథ, మిషన్ భగీరథ గ్రిడ్, పశు వైద్య, ఐకేపీ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, విద్య, ఐసీడీఎస్, ఉద్యానవన తదితర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారిని ప్రత్యేక అధికారులుగా నియమించారు.

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను కొన్ని మండలాల్లో మాత్రమే నియమించారు. అయితే మేజర్ గ్రామ పంచాయతీల్లో గెజిటెడ్ అధికారులైన ఎంపీడీవోలు, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ లు, ఎంపీ ఓలు, మండల వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ ఏఈలు, పీజీహెచ్ఎంలు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. కాగా చిన్న గ్రామపంచాయతీల్లో ఐసీడీఎస్ ఉద్యోగులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, ఉపాధి హామీ, ఐకేపీ, ఏఈవోలు, తదితర శాఖల ఉద్యోగులు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. వీరు సర్పంచుల స్థానాల్లో ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story