జనవరి 22న ప్రతి ఇంట్లో మరో దీపావళి పండుగ జరుపుకోవాలి

by Sridhar Babu |
జనవరి 22న  ప్రతి ఇంట్లో మరో దీపావళి  పండుగ జరుపుకోవాలి
X

దిశ, నిజామాబాద్ సిటీ : మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ కో కన్వీనర్ ధన్ పాల్ సూర్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఖిల్లా రామాలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. 20వ తేదీన నగరంలోని అన్ని పురాతన ఆలయాలలో శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 22వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఖిల్లా రామాలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. రాములవారికి అభిషేకం, హోమం, సీతారాముల కళ్యాణం, అన్నదానం కార్యక్రమం ఉంటుంది అన్నారు.

అక్కడే అయోధ్య రామ మందిర నుంచి ప్రసారం అయ్యే పునః ప్రతిష్ట కార్యక్రమం విక్షించడం జరుగుతుందని, అదే విధంగా అదే రోజు సాయంత్రం శంబుని గుడి చుట్టూ 1500 మంది మహిళా సోదరి మణులతో దీపారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కావున పెద్ద సంఖ్యలో మహిళా సోదరీమణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. 500 సంవత్సరాల నుండి

ఎంతో నిరీక్షస్తున్నామని, 22 వ తేదీన మన కోరిక నెరవేరుతుంది అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మి నారాయణ, మాస్టర్ శంకర్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివ ప్రసాద్, నారాయణ యాదవ్, బద్దం కిషన్, గిరిబాబు,రోషన్ లాల్ బోర,పుట్ట వీరేందర్,మఠం పవన్, చింతకాయల రాజు,చిరంజీవి,బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story