తల్లీ, ముగ్గురు పిల్లల అదృశ్యంపై కొనసాగుతున్న విచారణ..

by Kalyani |   ( Updated:2022-12-05 15:14:50.0  )
తల్లీ, ముగ్గురు పిల్లల అదృశ్యంపై కొనసాగుతున్న విచారణ..
X

దిశ, భిక్కనూరు: తల్లితో పాటు ముగ్గురు పిల్లలు అదృశ్యమైన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... జంగంపల్లికి చెందిన ఇర్ఫాన, భర్త జావెద్ తో డబ్బుల విషయమై గొడవ పడింది. గొడవలో తన ఫోన్ ను నేలకేసి కొట్టింది. మరుసటి రోజు ఉదయం ఇర్ఫాన తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకొని డ్వాక్రా గ్రూపులో డబ్బులు చెల్లించి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో భర్త జావేద్ పలుచోట్ల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్ఐఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ఫోన్ పగిలిపోవడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారిందని విచారణ కొనసాగుతుందని సోమవారం 'దిశ'తో వెళ్లడించారు.

Advertisement

Next Story

Most Viewed