ప్రజావాణిలో స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగి..

by Sumithra |
ప్రజావాణిలో స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగి..
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో ఓ ఉద్యోగి స్పృహ తప్పి పడిపోయింది. సోమవారం ప్రజావాణి ఉండడంతో అన్ని శాఖల అధికారులు కలెక్టర్ కార్యాలయానికి రాగ, ప్రజావాణి నిర్వహిస్తుండగా ఐసీడీఎస్ ఉమెన్ వెల్ఫైర్ ఆఫీసర్ (మహిళ శక్తి కేంద్ర)లో పనిచేస్తున్నస్వప్న(40)అనే ఉద్యోగి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన అధికారులు ఆ ఉద్యోగిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి ప్రైవేట్ వాహనంలో తరలించారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించి పరికరాలు లేకపోవడం, 108 అంబులెన్స్ సైతం అందుబాటులో లేకపోవడంతో డీడబ్యుఓ సుధారాణి, అటెండర్ దేవయ్యలు సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించడం గమనార్హం. ఉద్యోగికి ఎలాంటి అపాయం లేదని, అన్ని టెస్ట్ లు నిర్వహించి వైద్యం అందిస్తున్నట్లు డిడబ్యుఓ సుధారాణి, సూపరింటెండెంట్ ఇందిరా తెలిపారు. ఎండాకాలం అధిక ఉష్ణోగ్రత ఉండడంతో వడదెబ్బ తగిలి ప్రమాదాలు ఉన్నందున, ప్రజావాణి రోజున కలెక్టరేట్ లో ప్రభుత్వ అంబులెన్స్ ని అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed