తాగుడుకు బానిసైన యువకుడు సూసైడ్

by Naveena |
తాగుడుకు బానిసైన యువకుడు సూసైడ్
X

దిశ, కామారెడ్డి : మద్యం తాగుడుకు బానిసైన ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసముంటున్న ఉల్లి నరేష్ (35) అనే వ్యక్తి ఎల్లారెడ్డిలోని రుచి రెస్టారెంట్ లో వంట మాస్టర్ గా పని చేస్తున్నాడన్నారు. అయితే గత కొంత కాలం నుంచి తీవ్రంగా తాగుడుకు బానిసై భార్యా పిల్లలను వేధిస్తూ ఉండేవాడన్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి మధ్యాహ్న సమయంలో ఇంట్లోకి వెళ్లి..వంటగదిలోని ఉరి వేసుకున్నాడన్నారు. ఏదో శబ్దం అవగానే ఇంటి బయట కూర్చుని ఉన్న అతని భార్య ఉల్లి లహరితో పాటు..చుట్టుపక్కల వారు వచ్చి కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికి అతడు మృతి చెందిన్నట్లు డాక్టర్ నిర్ధారించాడన్నారు. ఈ విషయాన్ని అతని భార్య ఉల్లి లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed