- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
4 దశాబ్దాల తరువాత కలిసిన ఆత్మీయులు..
దిశ, నాగిరెడ్డిపేట్ : సృష్టిలో అన్నిబంధాల కంటే స్నేహబంధం చాలా గొప్పదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1980 - 81 విద్యా సంవత్సరంలో చదివిన పదవ తరగతి పూర్వవిద్యార్థులు నాలుగు దశాబ్దాల అనంతరం కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని అపూర్వంగా జరుపుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.
దీనికి ముందు తమకు పాఠాలు బోధించి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వవిద్యార్థులందరూ, గురువులను గౌరవించినట్లే తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ, వారికి దగ్గర ఉండి సేవలందించాలని సూచించారు. తమ పిల్లలకు కూడా తల్లిదండ్రులను గౌరవించేలా మంచి అలవాట్లు నేర్పించాలన్నారు. 1980 - 81 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వవిద్యార్థులందరూ తమ తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఉల్లాసంగా గడిపారు. ఆత్మీయ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విట్టల్ రెడ్డి, శ్యామ్ రావు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.