- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సైకిలిస్ట్‌ను ఢీ కొట్టిన బైక్.. ఒకరు స్పాట్ డెడ్
దిశ బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జక్కుల గంగారాం (35) అనే వ్యక్తి సైకిల్ తీసుకొని కామప్ప చౌరస్తా వైపునకు వస్తుండగా బీర్కూర్ గ్రామానికే చెందిన సమద్ అలియాస్ షారుఖ్ మరియు సుమెర్ ఇద్దరు కలిసి బీర్కూర్ నుండి బాన్సువాడ వైపునకు అతివేగంగా వెళ్తుండగా సైకిల్ పై ఉన్న గంగారాంను బైక్ తో ఢీ కొట్టడంతో గంగారాం అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. అదేవిధంగా బైక్ పై ఉన్న షారుఖ్ కు బలంగా గాయాలవ్వగా, సుమెర్ కు కూడా గాయాలియ్యాయి. దీంతో ఇద్దరినీ చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్ర అస్పత్రికి తరలించారు. కాగా షారుఖ్ పరిస్థితి విషయంగా ఉన్నదని వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింలు తెలిపారు.