Indian Army : ఆర్మీకి కొత్త పవర్.. సోషల్ మీడియా కంపెనీలకు నేరుగా నోటీసులు పంపే అధికారం

by Hajipasha |
Indian Army : ఆర్మీకి కొత్త పవర్.. సోషల్ మీడియా కంపెనీలకు నేరుగా నోటీసులు పంపే అధికారం
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రతిచోటా మంచి, చెడు రెండూ ఉంటాయి. సోషల్ మీడియాలోనూ అంతే. పాకిస్తాన్ గూఢఛార సంస్థ ఐఎస్ఐ మన దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటుంది. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయించి, వాటి ద్వారా భారతీయులను ట్రాప్ చేస్తుంటుంది. ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేసే ఒక సూపర్ పవర్ భారత ఆర్మీ(Indian Army)కి కొత్తగా లభించింది. చట్టవిరుద్ధమైన సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై సోషల్ మీడియా కంపెనీలకు నేరుగా నోటీసులను పంపించే పవర్స్ కలిగిన ‘నోడల్ అధికారి’గా భారత సైన్యంలోని వ్యూహాత్మక కమ్యూనికేషన్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్‌ను గుర్తించారు. ఈవిషయాన్ని స్వయంగా భారత రక్షణ శాఖ నోటిఫై చేసింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79(3)(బి) ప్రకారం భారత సైన్యం, దాని అనుబంధ విభాగాలకు సంబంధించిన కంటెంట్‌‌ను ‘వ్యూహాత్మక కమ్యూనికేషన్ విభాగం’ నిత్యం పర్యవేక్షిస్తుంది. ఏదైనా అభ్యంతరకర కంటెంట్‌(social media posts)ను ఈ విభాగం గుర్తిస్తే.. ఇకపై వెంటనే సోషల్ మీడియా కంపెనీలకు నోటీసులు పంపి, వివరణను తీసుకుంటుంది. ఇంతకుముందు ఇలాంటి సమాచారాన్ని భారత ఆర్మీ కమ్యూనికేషన్ విభాగం కేంద్ర ఐటీశాఖకు పంపేది. ఐటీ శాఖ నుంచి సోషల్ మీడియా కంపెనీలకు నోటీసులు వెళ్లడంలో జాప్యం జరిగేది. ఇకపై ఇలాంటి జాప్యం జరగదు.

Advertisement

Next Story

Most Viewed