- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పండగ పూట... మంచినీళ్లకై పడరాని పాట్లు.
దిశ, పోతంగల్ : గత పదిహేను రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ పండగ పూట ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన ఘటన పోతంగల్ మండలం టాక్లి గ్రామంలో చోటుచేసుకుంది. మిషన్ భగీరథ అధికారుల అలసత్వం, గ్రామ పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం తో టాక్లి గ్రామస్తులు మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. బుక్కెడు మంచినీళ్ల కొరకై మురికి కాలువలో బిందెలు పెట్టి పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ పంచాయతీ కార్యదర్శి కి చెబితే తమపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాపోతున్నారు.
పలుమార్లు మిషన్ భగీరథ అధికారులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి మొరపెట్టుకున్న ఉన్నతాధికారుల మెప్పు కొరకై ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారే తప్ప తమ సమస్యను పరిష్కరించడం లేదంటూ పండగపూట ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. తమ గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య కారణంగా తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ నీళ్లనే వినియోగిస్తున్నామని గత 15 రోజులుగా త్రాగునీరు లేక గ్రామంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆందోళనకు దిగారు. గ్రామంలో చాలా కుటుంబాలు వృద్ధులు ఉన్నారని మిషన్ భగీరథ నల్లలో నీళ్లు రాకపోవడంతో దూరం నుంచి నీళ్లు మోసుకోలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మండల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వెంటనే అధికారుల స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కోరారు.