నల్లమలలో రాత్రి అకాల భారీ వర్షం.. రెండు వందల ఎకరాలలో నీట మునిగిన పత్తి పంట

by Aamani |
నల్లమలలో రాత్రి అకాల భారీ వర్షం.. రెండు వందల ఎకరాలలో నీట మునిగిన పత్తి పంట
X

దిశ, అచ్చంపేట : అతివృష్టి అనావృష్టి ఎటొచ్చి రైతన్నకు మాత్రం నష్ట కలుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన పంట బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో వందల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. జిల్లాలోని అమ్రాబాద్, పదరా మండలాలలో బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని కుండపోత వర్షం దాదాపు రెండు గంటల పాటు పలు ప్రాంతాల్లో దాచి కొట్టింది. పదర మండలంలోని ఒక్క చిట్లం గుంట గ్రామంలో ఆవుల వెంకటయ్య 5 ఎకరాలు, పల్లె తిరుపతయ్య నాలుగు ఎకరాలు, పల్లె ఈదయ్య 5 ఎకరాలు బిచ్చ నాయక్ 5 ఎకరాలు, లక్ష్మ మూడెకరాలు, ఆంజనేయులు మూడు ఎకరాలు ఇలా ఈ పై గ్రామములోనే 50 ఎకరాలకు పైగా పత్తి పంట నీట మునిగిందని రైతులు వాపోయారు. ఇలా మొత్తంగా రెండు మండలాలలో సుమారు 200 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగి నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబో అంటున్నారు. ఎకరాకు 12 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి దిగుబడి వచ్చేదని, ఒక్కొక్క రైతుకు రెండు మూడు లక్షల వరకు నష్టం జరిగిందని, కావున ప్రభుత్వం పంట నష్టం అందజేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed