TTD: ఐదేళ్లు తిరుమలకే వెళ్లలేదు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

by Rani Yarlagadda |   ( Updated:2024-10-31 06:00:21.0  )
TTD: ఐదేళ్లు తిరుమలకే వెళ్లలేదు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఛైర్మన్ గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడు (BR Naidu)ని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తనకు పదవి ఇవ్వడంపై స్పందించారు. తనకు ఇంత గౌరవమైన పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు (Chandrababu), ఎన్డీయే పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అర్చకుల నుంచి వేదాశీర్వచనం తీసుకున్న అనంతరం.. మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏడాదికి ఐదారుసార్లు తిరుమలకు (Tirumala) వెళ్లే వాళ్లమని, గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్లలేదన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో అనేక అరాచకాలు చేసిందని ఆరోపించారు.

తాను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగానన్న బీఆర్ నాయుడు.. చిన్నప్పటి నుంచి తిరుమల ఆలయానికి తప్ప మరో ఆలయానికి వెళ్లలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఏటా ఆలయానికి వెళ్లే తాము.. ఐదేళ్లు వెళ్లలేదంటే ఆ బాధెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తమ ప్రాంతంలో కొండకు పోతామని అంటామని చెప్పారు. టీటీడీ (TTD) ఛైర్మన్ పదవి రావడం తన జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నా అని, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానని అన్నారు. తిరుమలలో చాలా సమస్యలున్నాయని, వాటిపై చంద్రబాబుతో గతంలోనే చర్చించినట్లు చెప్పారు. ఛైర్మన్ గా మరోసారి చర్చించి, ఆయన సలహాలతో ముందుకెళ్తామని బీఆర్ నాయుడు తెలిపారు.

తిరుమలలో పనిచేసేవాళ్లంతా హిందువులై ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ నాయుడు. టీటీడీ ఆస్తుల్ని కాపాడేలా చర్యలు తీసుకుంటామని, అలాగే టీటీడీ భూములపై కమిటీ వేస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed